మహిళా సాధికారతకు తోడు నాణ్యమైన విద్య-నల్లగొండ జిల్లాలో వేగవంతంగా స్కూల్ యూనిఫారాల పంపిణీ!
నల్గొండ ప్రతినిధి ప్రజా సంక్షేమం న్యూస్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేగంగా,నాణ్యమైన యూనిఫారాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.విద్యార్థుల కొలతలు తీసుకోవడం నుంచి కుట్టింపు,నాణ్యత పరిశీలన,పాఠశాలలకు పంపిణీ చేసే వరకు ప్రతీ దశను అధికారులు,సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పంపిణీ వివరాలు.. జిల్లాలోని 55 రెసిడెన్షియల్ ( టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్, టిజిటిడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజెపిటిబిసి డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఎంఆర్ఈఐఎస్, కేజీబీవీ ) పాఠశాలలకు చెందిన 22,189 మంది విద్యార్థులకు (6,346 మంది...