ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాల నిర్ణయాల అమలుపై సీఎస్‌ సంజయ్‌ జాజు సమీక్ష!

ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: వివిధ శాఖలతో గౌరవ ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో జారీ చేసిన నిర్ణయాలు,ఆదేశాల అమలు పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్‌ జాజు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై శాఖల వారీగా రూపొందించిన *చర్యల అమలు నివేదికలు (Action Taken Reports – ATRs)*ను సీఎస్‌ సమీక్షించారు. ప్రతి శాఖ సమగ్రంగా, తాజా సమాచారంతో కూడిన ATRలను సమర్పించాలని ఆయన సూచించారు. తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతి, ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు,...