PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 3:38 pm Posted by : Praja Sankshemam News

మునుగోడులో ఆయిల్ ఫాం సాగు సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి



ప్రజా సంక్షేమం న్యూస్ చండూరు
చండూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శ్రీ కె నాగమల్లేశ్వరరావు గారి అధ్యక్షతన మరియు ఎంపీడీవో బండారు యాదగిరి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై మరియు సామర్ధ్య పెంపుదల కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు శ్రీ నెల్లికంటి సత్యం గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వివిధ గ్రామాల సర్పంచులు హాజరైనారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మండల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు రాబోయే కాలంలో చేపట్టబోవు పనుల గురించి అధికారులతో చర్చించారు ప్రభుత్వ పథకాల అమలు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు పారిశుధ్యం త్రాగునీరు ఉపాధి హామీ పంచాయతీ రాజ్ సంబంధించిన అంశాలపై చర్చ జరిగినది ఈ సందర్భంగా శాసనసభ్యులు మునుగోడు కాన్స్టెన్సీలో సేంద్రీయ పంటలు ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయాలని ప్రధానంగా ప్రతి గ్రామంలో ఐదుగురు రైతులను ఎంపిక చేసి ఆయిల్ ఫామ్ సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని అందుకు రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని తెలియజేశారు అలాగే మద్యపాన నిషేధం ఇందిరమ్మ ఇళ్ల మీద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులు పారదర్శకంగా పనులు చేయాలని మాట్లాడడం జరిగింది అలాగే శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో అందరూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో 17 గ్రామాల సర్పంచులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..