మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి:ముఖ్యమంత్రి

ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు.భూసేకరణ ప్రక్రియలో ఎఫ్‌టీఎల్,బఫర్‌ జోన్,అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా...