PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 2:08 pm Posted by : Praja Sankshemam News

మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణ కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణ కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

రూ.7,000 జరిమానా.. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు తెలిపారు.

2020 సంవత్సరంలో మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి క్రైమ్ నంబర్ 97/2020, SC No.198/2020లో IPC సెక్షన్లు 448, 366, 376(2)(i), POCSO చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబా, వయస్సు 20 సంవత్సరాలు, నిందితుడిగా ఉన్నాడు.

కేసును దర్యాప్తు చేసి నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితుడిపై న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేయగా అనంతరం కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని IPC సెక్షన్ 366 మరియు POCSO చట్టం సెక్షన్ 3 & 4 కింద దోషిగా నిర్ధారించింది.

IPC సెక్షన్ 366 కింద నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా* విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అదేవిధంగా POCSO చట్టం సెక్షన్ 3 & 4 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

POCSO చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం IPC మరియు POCSO చట్టాల కింద వర్తించే శిక్షల్లో అధికమైన శిక్షను అమలు చేయాల్సి ఉండటంతో, అత్యాచారం నేరానికి POCSO చట్టం కింద విధించిన శిక్షను అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది.

అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నాయి.
దీంతో IPC సెక్షన్ 366 కింద 5 సంవత్సరాలు, POCSO చట్టం కింద 20 సంవత్సరాలు విధించబడినప్పటికీ, కోర్టు ఆదేశాల ప్రకారం శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయి. మొత్తం జరిమానా రూ.7,000 అదేవిధంగా బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించిన అప్పటి మిర్యాలగూడ-II(T) పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న డి. శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కేసును న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించిన వేముల రంజిత్ కుమార్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జె. సోమ నర్సయ్య, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కోర్టు డ్యూటీ విధుల్లో సమన్వయంతో పనిచేసిన డి.సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్,సిడిఓ బుర్రి అఖిల్,డి. రాగ్యా నాయక్, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు అభినందించారు.

ఈ సందర్బంగా జిల ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వ్యక్తులపై నల్గొండ జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ ప్రక్రియలను సమర్థవంతంగా కొనసాగిస్తామని తెలిపారు.