యుపిఎస్ నీర్నేముల పాఠశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

యుపిఎస్ నీర్నేముల పాఠశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన* *చెరువులు, పౌల్ట్రీ ఫారమ్‌లపై ప్రాక్టికల్ అవగాహన...పాఠ్యపుస్తకాలలోని పాఠాలను కేవలం తరగతి గదికే పరిమితం చేయకుండా, విద్యార్థులకు నిత్య జీవితంలో ఉపయోగపడేలా ప్రాక్టికల్ విజ్ఞానాన్ని అందించేందుకు యుపిఎస్ నీర్నేముల పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న అడుగు వేశారు. పాఠశాల విద్యార్థులకు క్షేత్ర పర్యటన నిర్వహించి, గ్రామంలోని స్థానిక చెరువు మరియు పౌల్ట్రీ ఫారమ్‌ను సందర్శింపజేశారు. ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు క్షేత్రస్థాయిలో పలు కీలక విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు: *చెరువుల ప్రాముఖ్యత & ఉపయోగాలు: చెరువుల వలన వ్యవసాయానికి నీరందడమే...