యువ న్యాయవాదుల సంక్షేమంపై కేంద్రాన్ని నిలదీసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
* జూనియర్ న్యాయవాదులకు నెలవారీ స్టైపెండ్, సంక్షేమంపై లోక్‌సభలో ప్రశ్నలు * పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు స్టైపెండ్‌ను బీసీఐ సిఫారసు చేసినట్లు కేంద్రం వెల్లడి! 'ప్రజా సంక్షేమం' న్యూస్ దేశవ్యాప్తంగా తొలి దశలో ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూనియర్ న్యాయవాదులకు నెలవారీ స్టైపెండ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రుణాలు, న్యాయ సహాయ ప్రోత్సాహకాలు, సామాజిక భద్రత వంటి...