రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు చెప్పారు. హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన రోడ్ నెట్‌వర్క్ విస్తరణ, జరుగుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్షించారు.ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షలో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణ, రుణ సేకరణ, నిర్వహణ వంటి...