రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి రాఖీ కట్టిన మహిళలు!

ప్రజాసంక్షేమం న్యూస్: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి నివాసంలో సందడి నెలకొంది.ఎమ్మెల్యే గారి బంధువులతో పాటు నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఇంటా ఆనందం,ఆరోగ్యం,సుఖసంతోషాలు వెల్లివిరియాలని,సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.