ప్రజాసంక్షేమం న్యూస్:
రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశాను. ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక బస్సుల నిర్వహణ, తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది.ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాను. గత ఏడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా, ఈ ఏడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 240 బస్సులను పెంచడం జరిగింది.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి 31 సోమవారం వరకు తిరుగు ప్రయాణాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించి,
పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి, ప్రధాన బస్‌స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించడం జరిగింది. అవసరమైన చోట అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.బస్‌స్టేషన్లలో మంచినీరు, మరుగుదొడ్లు,పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేయడం జరిగింది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించడం జరిగింది.పండుగ రద్దీ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమష్టిగా, ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కోరడం జరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది.ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి.