రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు!
ప్రజాసంక్షేమం న్యూస్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశాను. ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక బస్సుల నిర్వహణ, తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది.ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాను. గత ఏడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా, ఈ ఏడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 240 బస్సులను పెంచడం జరిగింది.ప్రయాణికుల రద్దీకి...