రాఖీ బంధం.. రక్షణకు ప్రతీక అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షా బంధన్.. ప్రేమ, గౌరవం, బాధ్యతకు పిలుపు

రాఖీ బంధం చిరకాలం నిలవాలి.. అన్నాచెల్లెళ్ల అనుబంధం మరింత బలపడాలి.. ప్రతి ఇంటా ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలి. ప్రత్యేక కథనం | ప్రజా సంక్షేమం న్యూస్ ఆగస్టు 28: అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు శుక్రవారం ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను ఆకాంక్షించడం ఈ పండుగలో ప్రధాన సంప్రదాయం. రాఖీ.. కేవలం ఒక దారం కాదు రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం మాత్రమే...