రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తా! ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

ప్రజా సంక్షేమ న్యూస్-హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు...