PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:33 pm Posted by : Praja Sankshemam News

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. అభివృద్ధి, సంక్షేమానికి ఎక్కడా కొరత రానివ్వం.మంత్రి పొంగులేటి

ప్రజాసంక్షేమం న్యూస్ -నల్లగొండ
ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా విస్తృతంగా పర్యటించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సహచర మంత్రి Danasari Seethakka గారు , ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ గారు, ఎంపీలు Vem Narender Reddy గారు, బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే లు మురళి నాయక్ గారు, కే.ఎల్. నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కేసముద్రంలో రూ.1.90 కోట్లతో నిర్మించిన 33/11kv విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది.అదే విధంగా రూ.6 కోట్ల తో కేసముద్రం మండలంలో మున్సిపాలిటీ భవన సముదాయ నిర్మాణానికి రూ.2.25 కోట్లతో ఇనుగుర్తి, రూ. 2.25కోట్లతో సీరోలు,రూ. 2.25 కోట్లతో దంతాలపల్లి మండలాలకు సంబంధించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.తెలంగాణలో గత రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పడిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించకుండా సమపాలలో ముందుకు తీసుకెళుతున్నాం. తెలంగాణను అన్నిరంగాల్లో అగ్ర పథంలో నిలపడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం.