PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 12:11 pm Posted by : domalapallygopi@gmail.com

రూ. 16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో!

ప్రజా సంక్షేమం న్యూస్:
ఆత్రేయపురం (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా):

భూ మ్యుటేషన్ పనుల కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామానికి చెందిన వీఆర్వో నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ర్యాలి గ్రామానికి చెందిన శ్రీమతి చిన్న లక్ష్మి ప్రసన్న సర్వే నెంబర్ 381/6 లోని 0.09 సెంట్ల భూమికి సంబంధించి మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి, తదుపరి చర్యలకు పంపించేందుకు వీఆర్వోను సంప్రదించారు. అయితే ఈ అధికారిక పని చేయడానికి వీఆర్వో రూ. 16,500 లంచం డిమాండ్ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. శనివారం (29.08.2026) సాయంత్రం సుమారు 4:50 గంటలకు ర్యాలి గ్రామ సచివాలయంలో ఫిర్యాదుదారు నుంచి రూ. 16,500 లంచం స్వీకరించి, తన ఎడమ షర్టు జేబులో పెట్టుకున్న సమయంలో ఏసీబీ అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు.సాక్షుల సమక్షంలో వీఆర్వో జేబు నుంచి లంచం సొమ్ము రూ. 16,500 స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో చేతులకు రసాయన పరీక్ష నిర్వహించగా కుడి చేతికి పాజిటివ్ ఫలితం వచ్చిందని అధికారులు తెలిపారు. బాధితురాలికి సంబంధించిన అధికారిక దస్త్రాన్ని (ఫైల్) కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోస్ట్ ట్రాప్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అదనపు ఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.