రూ. 16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో!
ప్రజా సంక్షేమం న్యూస్: ఆత్రేయపురం (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా): భూ మ్యుటేషన్ పనుల కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామానికి చెందిన వీఆర్వో నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ర్యాలి గ్రామానికి చెందిన శ్రీమతి చిన్న లక్ష్మి ప్రసన్న సర్వే నెంబర్ 381/6 లోని 0.09 సెంట్ల భూమికి సంబంధించి మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి, తదుపరి...