ప్రజాసంక్షేమం న్యూస్
రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు,కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.రైతుల హక్కులు,వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు వంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన విస్తృత అంశాలపై నిరంతరం కృషి చేస్తూ జీవితాన్ని రైతుల సంక్షేమం కోసం అంకితం చేసిన నాయకుడు మల్లారెడ్డి గారని పేర్కొన్నారు.సారంపల్లి మల్లారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి గారు సంతాపాన్ని,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.