PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 4:28 pm Posted by : Praja Sankshemam News

రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి వేసుకోవద్దు..ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి


రైతులు ఎట్టిపరిస్థితుల్లో వరి వేసుకోవద్దు…
సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రాజెక్టుల నీటి లభ్యతపై సమీక్ష
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు

తాగునీటికే మొదటి ప్రాధాన్యత.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచన

నల్లగొండ (ప్రజా సంక్షేమం):
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలో నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు మరియు పంటల పరిస్థితిని వివరించారు.
సమావేశంలోని ముఖ్య విషయాలు:
తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత: ప్రస్తుతం ప్రాజెక్టులలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే అత్యంత ప్రాధాన్యతగా కేటాయించడం జరుగుతుందని, ఆ తర్వాతే పంటల సాగు గురించి ఆలోచిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.వరి సాగు వద్దు – ఎండిపోయే ప్రమాదం: వర్షాలు లేకపోవడం, రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వరి వేసుకోవద్దని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులు, బోరు బావుల కింద వరి వేస్తే ఏ దశలోనైనా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.భూగర్భ జలాలు తగ్గే అవకాశం: వచ్చే 6 నెలల పాటు ఇదే తరహా పరిస్థితులు కొనసాగవచ్చని, బోర్లలో కూడా నీటిమట్టం తగ్గే అవకాశం ఉన్నందున వరి సాగుకు అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు.
ఆగస్టు 15 లోపు ప్రత్యామ్నాయ పంటలు: ఈ సీజన్‌లో వరికి బదులుగా కంప సాగర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. కంది, మిల్లెట్స్, పెసర, మినుము, బొబ్బర్లు, ఉలవలు, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆపత్కాల పంటలను సాగు చేయాలని సూచించారు.విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే ఇస్తుంది: ఆగస్టు 15 వరకే ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున ఈ వారంలోనే విత్తనాలు వేసుకోవాలని, ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వమే అందిస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
రైతన్నలు ప్రస్తుత నీటి పరిస్థితులను అర్థం చేసుకుని, నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

రిపోర్ట్: దోమలపల్లి గోపి (ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393