లాస్ట్ మైల్ కనెక్టివిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహా ధర్నా

ఆటో డ్రైవర్లకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ పోరుబాట హైదరాబాద్: లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ (టీఆర్‌టీయూ) ఆందోళనకు సిద్ధమైంది. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు టీఆర్‌టీయూ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ట్రేడ్ యూనియన్ నాయకులు...