PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 4:30 am Posted by : Praja Sankshemam News

లోక్యతండలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా పర్యటన

నల్లగొండ జిల్లా లోని త్రిపురారం మండలం చేశారు . ఇటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ,ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న కలెక్టర్ వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు.జారీ చేశారు . గ్రామంలో ప్రస్తుతం 43 పింఛన్లు ఉండగా మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు . సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని కలెక్టర్ దృష్టికి గ్రామస్థులు.తీసుకురాగా వెంటనే స్పందించి నీటి సరఫరా లైన్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశం జారీచేశారు గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు గ్రామంలో రెండు డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు,చేశారు విద్యార్థులకు సోమవారం నుంచి యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ అన్నారు .ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తీరుపై గ్రామస్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు .