వన మహోత్సవం, ఉపాధి హామీ పనుల పురోగతిపై జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్:

ప్రజాసంక్షేమం న్యూస్: సచివాలయంలో వన మహోత్సవం, ఉపాధి హామీ పనుల పురోగతిపై జిల్లాల అధికారులతో పపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు .రాష్ట్రంలో 6.18 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5.32 కోట్లకు పైగా మొక్కలు నాటి 86% లక్ష్యాన్ని పూర్తి చేశాము.వర్షాలు అనుకూలంగా ఉన్న ఈ సమయంలోనే మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మొక్కలు నాటడంతో మన బాధ్యత పూర్తి కాదు. నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి...