వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి:మంత్రి ఉత్తమ్

సెప్టెంబర్–అక్టోబర్‌లో వర్షాలు తగ్గితే పరిస్థితి మరింత క్లిష్టం: 53 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న దొండపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం:మంత్రి ఉత్తమ్ ప్రజా సంక్షేమం న్యూస్,సూర్యాపేట, ఆగస్టు 20: రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.సెప్టెంబర్‌,అక్టోబర్‌ నెలల్లో వర్షపాతం లోటు కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లాలో మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం పనుల...