విద్య,వైద్యం,రహదారులు,గృహ నిర్మాణంతో సమగ్ర అభివృద్ధే లక్ష్యం:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
లచ్చగూడెం అభివృద్ధికి రూ.37.75 కోట్ల నిధులు! నర్సింగ్ కళాశాల, రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన! ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో ఆత్మీయ ముచ్చట! ప్రజాసంక్షేమం న్యూస్ -మధిర ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో రూ.37.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.ఇందులో భాగంగా రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, రూ.7 కోట్లతో చింతకాని–వందనం ఆర్‌అండ్‌బీ...