విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపండి
విద్యార్థులని విద్యకు దూరం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి" బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు *అయితగోని జనార్దన్ గౌడ్* *₹10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే జులైలో సచివాలయం ముట్టడి - బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిక* రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, రాస్తారోకో, కళాశాల బహిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ...