ప్రజా సంక్షేమం న్యూస్-రామన్నపేట:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పాపమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న స్థానిక హెవీ ట్రక్ జాబర్స్ సభ్యులు స్పందించి, తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబానికి బాసటగా నిలిచారు.బాధిత కుటుంబానికి తమ వంతు సహాయంగా బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేసి,కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.భవిష్యత్తులోనూ కుటుంబానికి అన్ని విధాలా వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హెవీ ట్రక్ జాబర్స్ సభ్యులు నకిరేకంటి ఎల్లస్వామి,గూని నాగరాజు, జినుక రాజు,గూని రమేష్,ఎర్రోళ్ల వంశీ,గూని నవీన్, గూని గణేష్, చేగూరి నరసింహ, పోచంపల్లి వెంకటేష్, నకిరేకంటి మధు, గూని కృష్ణ, గూని మధులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.