శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణ దాడి కర్రలు, ప్లేట్లతో కొట్టి.. బూట్లతో ముఖంపై తొక్కిన తోటి విద్యార్థులు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై హాస్టల్‌లో రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థులు దాడి చేసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో హాస్టల్‌లో అభిషేక్‌ను కర్రలు, ప్లేట్లతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమ కుమారుడు మెట్లపై...