సారు గ్రామపంచాయతీ ఇచ్చారు…! సిబ్బందిని ఇవ్వగలరు….!

ప్రజా సంక్షేమం న్యూస్: నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ప్రజాభిప్రాయం మేరకు గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. కానీ ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదు. దీంతో ఆఫీసుకు తాళం వేలాడుతోంది, పరిపాలన పూర్తిగా స్తంభించింది.గత ఆరేండ్ల క్రితం హలియా మున్సిపాలిటీలో విలీనమైన ఇబ్రహీంపేటను తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. పంచాయతీగా మారి దాదాపు ఏడాది అవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామం ప్రాథమిక సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టులు: ఎలక్ట్రిసిటీ లైన్మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ఫీల్డ్...