సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే మన ప్రజా ప్రభుత్వ ధ్యేయం:ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజాసంక్షేమం న్యూస్ తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని కాపాడుకుంటూ,భవిష్యత్ తరాలకు లాభదాయకమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాలు విస్తరిస్తున్న తరుణంలో,కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా సింగరేణిని కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్, బంగారం వంటి కీలక ఖనిజాల (Critical Minerals) మైనింగ్ వైపు వేగంగా విస్తరిస్తున్నాం.నైని, తాడిచర్ల-2 మణుగూరు డిప్‌సైడ్-2 వంటి కీలక బొగ్గు బ్లాక్‌లను సాధించడంతో పాటు, కర్ణాటకలో గోల్డ్ మైన్ వేలంలో విజయం సాధించి కొత్త మైలురాళ్లను అందుకున్నాం. 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన...