సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నల్గొండ కలెక్టరేట్ ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ మహాధర్నా:

ప్రజాసంక్షేమం న్యూస్ -నల్లగొండ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించా రని , ఎన్నికల మేనిఫెస్టోలోను బహిరంగ వేదికల పైన సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీలు నేటికి కార్యరూపం దాచకపోవడంతో ఉద్యోగ వర్గాలలో తీవ్ర సంతృప్తిని కలిగిస్తుంది. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుందనేది అవాస్తవం! సరైన ఆర్ధిక ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులతో దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు అని ధర్నాలో పాల్గొన్న నాయకులు...