సూర్యాపేట జిల్లాలో మంత్రులు పొంగులేటి,కోమటిరెడ్డిల సుడిగాలి పర్యటన..
సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన! ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ,రిజిస్ట్రేషన్, సర్వే,గృహ నిర్మాణ అంశాలపై అధికారులతో సమీక్ష! ప్రజాసంక్షేమం న్యూస్: సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.హుజుర్ నగర్ మున్సిపాలిటీలో రూ. 1.4 కోట్లతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి మరియు సూర్యాపేట మున్సిపాలిటీలో రూ. 2.1 కోట్లతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది....