సెప్టెంబర్ 1న జరిగే మహాధర్నాను విజవంతం చేయాలి! పిఆర్‌టియు అధ్యక్ష,కార్యదర్శులు.
(ప్రజాసంక్షేమం న్యూస్-మునుగోడు): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఆర్‌టియు (PRTU) రాష్ట్ర నాయకత్వం, గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో పిలుపునిచ్చిన సెప్టెంబర్ 01 (Spt 01, 2026) మహాధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిఆర్‌టియు మునుగోడు మండల అధ్యక్షులు యూసఫ్ పాషా గారు, ప్రధాన కార్యదర్శి గొడ్డటి నరసింహ గారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పాఠశాలలకు ఇబ్బంది కలగకుండా ప్రతి పాఠశాలలో ఒక...