సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు!

ప్రజా సంక్షేమం న్యూస్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.మరోవైపు,...