సేవా స్ఫూర్తి దాత అన్వర్ అమీర్అలీఫౌండేషన్ అవార్డుకు ఎంపిక

ప్రజా సంక్షేమం న్యూస్-హలియా సమాజ సేవలో నిరంతరం ముందుండుతూ పేద, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం హలియా మున్సిపాలిటీ వాస్తవ్యులు షేక్ అన్వర్‌ గారిని అమీర్అలీ ఫౌండేషన్ అవార్డుకు ఎంపిక చేశారు. 1999లో విద్యార్థి సంఘం ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన అన్వర్‌.. 2005 నుంచి వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత 21 సంవత్సరాలుగా వీధి వ్యాపారులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే...