హైడ్రా DRF అసిస్టెంట్ల నియామకానికి నిరుద్యోగుల సంఖ్య నమోదు: సరూర్ నగర్ స్టేడియంలో సందడి

వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. ఎంపికల నిర్వహణకు శ్రమించిన అధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశాంతంగా సహకరించిన యువత హైదరాబాద్ (ప్రజా సంక్షేమం): హైడ్రా (HYDRAA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పరిధిలోని 100 DRF అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ శనివారం సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఆగస్టు 8, 9 తేదీల్లో ఈ ఎంపికలు ఉంటాయని ఇదివరకే ప్రకటించడంతో, ఉదయాన్నే దాదాపు 3 వేల మందికి పైగా అభ్యర్థులు మైదానానికి తరలివచ్చారు.అభ్యర్థుల రద్దీ – అధికారుల సమయస్ఫూర్తి:ఒకేసారి...