హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) క్యాంపస్!

ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి తెలిపారు.ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్‌లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ అధికారులు కె రామకృష్ణారావు గారు,జయేశ్ రంజన్...