RMP డాక్టర్ నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థిని బలి..

ఆర్​ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు జీవితం బలైంది. ఆర్​ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో జరిగింది. బోనాల పండుగ అని ఇంటికి వచ్చి కుటుంబీకులతో ఆనందంగా గడిపిన బాలిక ఇప్పుడు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు....