అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలి:సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలి... ప్రజాసంక్షేమం న్యూస్ -నల్గొండ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను ముందస్తు అరెస్టుల పేరుతో అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం లు పిలుపునిచ్చారు.బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అక్రమ అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు సామూహిక నిరసన దీక్షలు చేయడం జరిగింది...