అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: సి ఎస్
– విజిలెన్స్ బృందాలతో నిరంతర తనిఖీలు,ఆకస్మిక దాడులు – ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం – ఖనిజ వనరులతో రాష్ట్ర ఆదాయం పెంచేలా చర్యలు ప్రజాసంక్షేమం న్యూస్|హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.సోమవారం సచివాలయంలో గనులు,భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని,విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక దాడులు చేపట్టి అక్రమ రవాణాను అరికట్టాలని...