ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి..
ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి గారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి…
ప్రజాసంక్షేమం న్యూస్
అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి గారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.సాగు నీటి ప్రాజెక్టులు,ఔటర్ రింగు రోడ్డు వంటి అభివృద్ధి పనులు, రుణమాఫీ,ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో పాలనపై చెరగని ముద్ర వేసిన నాయకుడని ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ గారి సేవలను స్మరించుకున్నారు. దివంగత నేత వైఎస్సార్ గారికి నివాళులర్పించిన వారిలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సురేశ్ షెట్కార్ గారు, పోరిక బలరాం నాయక్ గారు ఉన్నారు.