అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్ మునుగోడు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్): మునుగోడు మండలంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో అసలైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్ ఆరోపించారు.అన్ని వసతులు ఉన్న కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన పేదలకు మాత్రం ఇళ్లు దక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతి గ్రామానికి స్వయంగా వెళ్లి అర్హత కలిగిన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా గుర్తించాలని...