అసెంబ్లీ నిరవధిక వాయిదా…

51 గంటల 52 నిమిషాలు.. ఎనిమిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ... ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఎనిమిది రోజుల పాటు వాడీవేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.సెప్టెంబర్ 7న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 51 గంటల 52 నిమిషాలు కొనసాగాయి.ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాలు, చర్చలు,సభ్యుల ప్రసంగాలు,ప్రభుత్వ ప్రకటనలు,బిల్లుల ఆమోదం వంటి అంశాలు సభలో చోటుచేసుకున్నాయి.సభలో మూడు ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించగా,సభ ముందుకు వచ్చిన నాలుగు బిల్లులకు కూడా ఆమోదముద్ర పడింది.అదేవిధంగా నాలుగు స్వల్పకాలిక చర్చలు జరిగాయి.సమావేశాల...