PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 11:08 am Posted by : Praja Sankshemam News

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు.. తెలంగాణ భవన్ నిర్మాణాలపై సీఎం సమీక్ష !

తెలంగాణ చరిత్ర,సంస్కృతి,శిల్పకళ ప్రతిబింబించేలా డిజైన్లు!
శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక.. నిర్ణీత సమయంలో పనుల పూర్తి..
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారులు, కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి..
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:
సచివాలయంలో ఆదిలాబాద్,వరంగల్ విమానాశ్రయాలు,ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణాల రూపకల్పన తెలంగాణ చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు,శిల్పకళకు ప్రతీకగా నిలిచేలా ఉండాలని సూచించారు.ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణంలో విద్యుత్, రహదారులు, తాగునీరు, నీటిపారుదల, బీఎస్ఎన్ఎల్ తదితర శాఖల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాలకు విశాలమైన రహదారులు, మెరుగైన రవాణా కనెక్టివిటీ,నీటి ప్రవాహాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.నిర్మాణ నాణ్యతతో పాటు ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.