ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు.. తెలంగాణ భవన్ నిర్మాణాలపై సీఎం సమీక్ష !

తెలంగాణ చరిత్ర,సంస్కృతి,శిల్పకళ ప్రతిబింబించేలా డిజైన్లు! శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక.. నిర్ణీత సమయంలో పనుల పూర్తి.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారులు, కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి.. ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:సచివాలయంలో ఆదిలాబాద్,వరంగల్ విమానాశ్రయాలు,ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణాల రూపకల్పన తెలంగాణ చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు,శిల్పకళకు ప్రతీకగా నిలిచేలా ఉండాలని సూచించారు.ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణంలో విద్యుత్, రహదారులు, తాగునీరు, నీటిపారుదల, బీఎస్ఎన్ఎల్ తదితర శాఖల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పనులను నిర్ణీత గడువులో...