PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 4:05 pm Posted by : Praja Sankshemam News

ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డకు స్వర్ణం.

మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్‌కు గోల్డ్ మెడల్
చికితతో పాటు వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
యువ క్రీడాకారులకు ఈ విజయం స్ఫూర్తిదాయకమన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 30: ప్రజా సంక్షేమం న్యూస్

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు–2026లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన తానిపర్తి చికితతో పాటు జట్టు సభ్యులు వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అద్భుత ప్రతిభతో భారత క్రీడా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటిన ఈ విజయం దేశానికి, తెలంగాణకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఈ విజయం మరెంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి దేశ గౌరవాన్ని, తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.ఆసియా క్రీడలు–2026లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొని పతకాలు సాధిస్తూ భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న టీమ్ ఇండియా క్రీడాకారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ బిడ్డ చికితకు, భారత ఆర్చరీ విజేతలకు హృదయపూర్వక అభినందనలు.