ఇకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై రూ.5 లక్షల జరిమానా!

తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు.. షోకాజ్ నోటీసులకు వివరణపై అధికారులు అసంతృప్తి.. 30 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం! ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ, సెప్టెంబర్ 25: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010 నిబంధనల అమలులో భాగంగా నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో గుర్తించిన పలు లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని ఆసుపత్రికి రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి ఉత్తర్వులు జారీ...