ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నిధులు మంజూరు..!

ప్రజాసంక్షేమం న్యూస్: సెప్టెంబర్ 5వ తేదీ శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు మరియు జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర శిక్ష నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి మండల కేంద్రానికి ₹5,000/- మరియు ప్రతి జిల్లా కేంద్రానికి ₹15,000/- చొప్పున నిధులు కేటాయించబడ్డాయి.సంబంధిత అధికారులు ఈ నిధులను నిబంధనల ప్రకారం వినియోగిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టగలరు.