PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:38 am Posted by : Praja Sankshemam News

ఉరుమడ్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి!
చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు..
ప్రజాసంక్షేమం న్యూస్ ఉరుమడ్ల,సెప్టెంబర్ 27:

స్వేచ్ఛా స్వాతంత్ర్యం,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన తెలంగాణ బాపూజీ స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఉరుమడ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భానుశ్రీ భిక్షం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు, గ్రామస్థులు ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్,సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము,పంచాయతీ కార్యదర్శి ఎలేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు అయితరాజు నర్సింహ, రూపని యాదయ్య, కొండ మహేశ్,మాజీ వార్డు సభ్యులు బషీర్,బెల్జ పరమేశ్,మందుగుల జయవర్ధన్, రూపని వెంకన్న, బెల్జ శంకరయ్య,కారోబార్ బెల్జ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం కోసం చేసిన పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు.