ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష:
* గ్రీన్ ఛానెల్ ద్వారా బాధితులకు తక్షణ పరిహారం * ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీలకు 31%, ఎస్టీలకు 17% కేటాయింపులు హైదరాబాద్ (ప్రజాసంక్షేమం న్యూస్): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చట్టం సమర్థవంతమైన అమలు, కేసుల దర్యాప్తు, వేగవంతమైన...