కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ‘చలో రవీంద్రభారతి’

మునుగోడు,సెప్టెంబర్ 27 (ప్రజా సంక్షేమం న్యూస్): తెలంగాణ ఉద్యమంలో ఆటలు, పాటలతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న డిమాండ్ చేశారు. మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పందిరి సైదన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన కళాకారులు ప్రస్తుతం ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు....