PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:45 pm Posted by : Praja Sankshemam News

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి:మాజీ MLA. శ్రీ చిరుమర్తి లింగయ్య

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు తీరు సరైంది కాదు:
ప్రజాసంక్షేమం న్యూస్ -రామన్నపేట

నకిరేకల్ నియోజకవర్గంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే సందర్భంగా రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయనందున ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 6 గ్యారెంటీలు మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవేర్చలేదు.6 గారంటీలు అమలు చేయాలని రాజ్యాంగబద్ధంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుంటే వారిని బలవంతంగా అరెస్టు చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో మాజీ మంత్రులు మహిళా నాయకులు ఉన్నారని చూడకుండా పోలీసు వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరు సరైంది కాదన్నారు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్ట్ మరియు రాజ్యాంగం బుక్ పట్టుకొని పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తే తప్పులేదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే తప్పు ఏంటి అన్నారు.మీకు చేతనైతే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే రాజీనామా చేయాలని హెచ్చరించారు